![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1005 లో..... ఇందుని ఎవరు కిడ్నాప్ చేసారని రేఖ ఆలోచిస్తుంది. పోలీసులని పిలిపించి సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేయమని అంటుంది. లేదు మేడం మీరు ఆఫీషియల్ గా కంప్లైంట్ ఇవ్వండి అని ఇన్ స్పెక్టర్ అంటాడు. వద్దు అలా అయితే కంపెనీ షేర్స్ తగ్గిపోతాయని రేఖ అనగానే సరే అని చెప్పి ఇన్ స్పెక్టర్ వెళ్లిపోతాడు. ఏంటి రేఖ.. నీ షేర్స్ కోసం నా మనవరాలిని రిస్క్ లో పెడతావా అని రేఖపై అపర్ణ కోప్పడుతుంది.
ఆ తర్వాత నాకు ఏం చెయ్యాలో తెలుసు.. నువ్వు సైలెంట్ గా ఉండమని రేఖ కోప్పడుతుంది. ఆ తర్వాత అపర్ణ గదిలోకి వెళ్తుంది. ఏంటి అపర్ణ మనవరాలు గురించి ఏమైనా తెలిసిందా అని సుభాష్ అడుగుతాడు. కంప్లైంట్ ఇవ్వకుండా సీక్రెట్ గా వెతకమని చెప్పిందని అపర్ణ చెప్తుంది. మరొకవైపు రాజుకి వాళ్ళ నాన్న ఫోన్ చేసి మాట్లాడతాడు. నేను బిజీగా ఉన్నాను పని పూర్తయ్యాక వస్తానని రాజు చెప్తాడు. అప్పుడే లక్కీ వచ్చి.. ఒరేయ్ ఆ అమ్మాయి కన్పించడం లేదని చెప్తాడు. దాంతో అంతా వెతుకుతారు. అప్పుడే ఇందు మొహం కడుక్కోని బయటకు వస్తుంది. వెంటనే రాజు వాళ్ళు మాస్క్ పెట్టుకుంటారు. చాలా థాంక్స్ ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసారాని ఇందు అంటుంది. ఆ తర్వాత నువ్వు అనుకున్న కిడ్నాపర్స్ కాదు మేం ఒరిజినల్ కిడ్నాపర్స్ అని చెప్పి ఇందుని లాక్కొని వెళ్లి తాళ్లతో కట్టి బంధిస్తారు .
మరొకవైపు కానిస్టేబుల్ నందుతో ఇందు కిడ్నాప్ గురించి చెప్తాడు. ప్లీజ్ బాబాయ్ ఎలాగూ సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ అంటున్నావ్.. మనం ఇద్దరం కలిసి చేద్దాం.. ప్లీజ్ ఇన్ స్పెక్టర్ తో మాట్లాడమని నందు రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో కానిస్టేబుల్ సరే అంటాడు. ఆ తర్వాత రేఖ సీసీటీవీ చూస్తుంటుంది. అందులో ఇందు వెయిటర్స్ తో మాట్లాడడం చూసి ఇదంతా ఇంట్లో వాళ్ళ ప్లాన్ అని భూషణ్ కి చెప్పి సుభాష్ ని రప్పిస్తుంది. ఎందుకు మా అయనని తీసుకొని వచ్చావని రేఖని అపర్ణ అడుగుతుంది. వెనకాల ఉండి ప్లాన్ చేసి .. ఇప్పుడేమో ఏం తెలియనట్లు యాక్టింగ్ చేస్తున్నావా అని అపర్ణతో రేఖ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |